calender_icon.png 3 December, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూత్‌కి కనెక్ట్ అయ్యేలా

03-12-2025 12:45:41 AM

శ్రీనందు హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘సైక్ సిద్ధార్థ’. వరుణ్‌రెడ్డి దర్శక త్వం వహించిన ఈ చిత్రాన్ని స్పిరిట్ మీడి యా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యా నర్లపై శ్రీనందు, శ్యామ్‌సుందర్‌రెడ్డి తుడి నిర్మించారు. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పా త్రలు పోషించారు. డిసెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ మంగళవారం లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఈవెంట్‌లో హీరో శ్రీనందు మాట్లాడుతూ.. “ఈ సినిమాకు ‘మీలాంటి యువకుడి కథ’ అనే ట్యాగ్‌లైన్ పెట్టాం. కథ కూడా ఇప్పుడున్న సొసైటీకి రిలేట్ అయ్యేలా, యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ కొందరికి నచ్చుతుం ది. సెకండాఫ్ అందరికీ నచ్చుతుంది. మీకు నచ్చకపోతే ప్రెస్‌మీట్ పెట్టి మరి క్షమాపణలు చెప్తాను” అన్నారు. హీరోయిన్ యామిని భాస్కర్ మాట్లాడుతూ.. “చాలా గ్యాప్ తర్వాత నా సినిమా రిలీజ్ అవుతుంది.

డైరెక్టర్ వరుణ్ చాలా సెన్సిబుల్‌గా ఈ కథ రాశారు” అని తెలిపారు. డైరెక్టర్ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ.. “పెళ్లిచూపులు, కేరాఫ్ కంచరపాలెం తర్వాత సురేశ్‌బాబు పూర్తిగా కొన్న సినిమా ఇది. గత పదేళ్లలో ఆయన ఇంత త్వరగా నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. తప్పకుండా సినిమా అందరికి వినోదం పంచుతుంది” అని చెప్పారు.