03-12-2025 12:46:54 AM
రామ్ పోతినేని హీరోగా నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్‌బాబు పీ దర్శకత్వం వహించారు. నవంబర్ 27న విడుదలై, ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న సందర్భంగా టీమ్ మంగళవారం నిర్వహించిన థాంక్యూమీట్‌లో హీరో రామ్ మాట్లాడుతూ.. “స్టార్ అండ్ ఫ్యాన్‌కు మధ్య ఉన్న ఎమోషన్ చెబుతూ, హ్యూమన్ ఎమోషన్ కూడా టచ్ చేసిన సినిమా ఇది.
ఇలాంటి ఎమోషన్ ప్రపంచంలో ఎక్కడా లేదు. మన తెలుగు సినిమాకే సొంతం. ఒక సినిమా చేస్తున్నప్పుడు హిట్టా ఫ్లాపా అనేది అనే భయమేస్తుంది. కానీ ఈ సినిమా చేసినప్పుడు మంచి సినిమా అని వెంటనే తెలుసుకుంటారా.. కొంచెం లేటుగా తెలుసుకుంటారా అనేది చూడాలనిపించింది. టీఎఫ్‌ఐ ఫెయిల్ అయ్యిందనే మాట వినిపిస్తుంది. కానీ టీఎఫ్‌ఐ ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. ఆంధ్ర కింగ్ తాలూకా మనసుకు చాలా దగ్గరైన సినిమా” అన్నారు. ‘తప్పకుండా ఈ సినిమాను మరింత మంది చూస్తారని కోరుకుంటున్నాన’ని హీరోయిన్ భాగ్యశ్రీ చెప్పింది.
డైరెక్టర్ మహేశ్‌బాబు మాట్లాడుతూ.. “సినిమాకు ప్రేక్షకుల నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడి నుంచి సినిమా చాలా లాంగ్ వెళ్లబోతుంది” అన్నారు. నిర్మాత రవి మాట్లాడుతూ.. “ఆంధ్ర కింగ్ తాలూకా అందరం కలిసి చాలా ప్రేమించి చేసిన సినిమా. మేము ఏదైతే ఆశించామో అన్ని మాకు వచ్చాయి. అయితే ప్రశంసలతో పోల్చుకుంటే కలెక్షన్స్ కాస్త తక్కువే ఉన్నాయి. నెక్స్ వీక్ అద్భుతమైన రన్ ఉటుందని నమ్ముతున్నాం” అని చెప్పారు. కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్, మర్విన్, చిత్రబృందం పాల్గొన్నారు.