27 April, 2026 | 11:47 AM

Breaking News

న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు: కేజ్రీవాల్ సంచలన నిర్ణయం   •   హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి   •   హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. ​ఎక్కడ చూసిన నో స్టాక్ బోర్డులు   •   నార్కెట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం: సాఫ్ట్‌వేర్ మృతి   •   ప్రతి కుటుంబం ఖచ్చితంగా వివరాలు నమోదు చేసుకోవాలి: భట్టి విక్రమార్క   •   బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఒక విప్లవం!   •   శ్రీవారి సేవలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు   •   దమ్మాయిగూడెం వద్ద రెండు లారీలు ఢీ   •   నిరుపేద చిన్నారి ప్రాణాల కోసం పోరాటం – దాతల సాయం కోసం తల్లిదండ్రుల విజ్ఞప్తి   •   బంకులు బంద్.. ప్రజలు పరేషాన్   •  

ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి

25-03-2025 01:40 AM

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

 మహబూబాబాద్, మార్చి 24 (విజయ కాంతి): మహబూబాబాద్ మండలంలోని ముత్యాలమ్మ గూడెం, ఆశ్రమ ఉన్నత పాఠశాల వసతి గృహం, గూడూరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్  హై స్కూల్ (ఈఎంఆర్‌ఎస్)  సందర్శించారు,ఈ సందర్భంగా ఆయన వసతి గృహంలోని కిచెన్, క్లాస్ రూమ్, డైనింగ్ హాల్, పరిసరాలను పరిశీలించారు.

పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో వారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య బోధనలు అందించాలని సూచించారు. ప్రతీ సబ్జెట్ వారిగా ప్రత్యేక శ్రద్ధ వహించి ఎలాంటి సందేహాలు ఉన్నా తీర్చాలని,  స్టడీ ఆవర్ లో ఉన్నా పిల్లలతో స్వయంగా మాట్లాడుతూ ఏమైనా ఇబ్బంది ఉందా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పిల్లలకు సూచించారు. అలాగే ప్రత్యేక అధికారులు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అందరూ వసతి గృహాలను సందర్శించాలని సూచించారు. రాత్రి సమయాలలో నిరంతర విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి క్రిమి కీటకాలు, విషపురుగులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటిస్తూ భోజనం సిద్ధం చేయాలని సూచించారు,ఈ తనిఖీల్లో కలెక్టర్ వెంట సంబంధిత వార్డెన్లు ఉపాధ్యాయులు ఉన్నారు.