22 August, 2026 | 3:51 PM

Breaking News

డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   వృద్ధులు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వాలి   •   మైనారిటీ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ కమీషనర్   •   జవాబుదారితనంతో విధులు నిర్వహించాలి   •   సెయింట్ జాన్స్ హైస్కూల్లో ప్రిన్సిపల్ రూపా రెడ్డికి శ్రద్ధాంజలి   •   కార్మిక హక్కుల పరిరక్షణ, ఉద్యమాలకు సిద్ధం కావాలి   •   చెట్టు కిందే తరగతులు.. కళాశాలలో వసతిగృహం నిర్వహణ   •   పేద విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి   •   ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •  

ఆటోబంద్ ప్రశాంతం

08-12-2024 02:49 AM

మహబూబాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ఆటో జేఏసీ తలపెట్టిన ఆటో బంద్ శనివారం మహబూబాబాద్, గూడూరు మండల కేంద్రంలో ప్రశాంతంగా ముగిసింది. ఆటో డ్రైవర్లు బస్డాండ్ సెంటర్లో నిరసన వ్యక్తం చేసి, అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఆటో డ్రైవర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు హరి, కార్యదర్శి సోమశేఖర్ మాట్లాడారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లకు ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దీనికి కారణం సీఎం రేవంత్‌రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మిక కుటుంబాలకు రూ.20 లక్షల బ్యాంక్ రుణాన్ని ఇవ్వాలని కోరారు. 50 సంవత్సరాలు పైబడిన వారికి ఆటో కార్మికుల పెన్షన్ సైతం అందజేయాలన్నారు.