మైత్రీ ట్రాన్స్ క్లినిక్ ప్రారంభం
08-12-2024 02:54 AM
మహబూబాబాద్, డిసెంబర్ (విజయక్రాంతి): మానుకోట నియోజక వర్గంలో ఎమ్మెల్యే బానోతు మురిళినాయక్ శనివారం సుడిగాలి పర్య టన చేశారు. జిల్లా ఆసుపత్రిలో మైత్రీ ట్రాన్స్ క్లినిక్‌ను ప్రారంభించా రు. ప్రతి గురువారం ట్రాన్స్‌జెండర్స్ కోసం మైత్రి క్లినిక్ ఏర్పాటు చేస్తున్నారని, దీనిని ట్రాన్స్‌జెండర్స్ ఉపయో గించుకోవాలన్నారు. మహబూబాబాద్ పట్టణంలో అంగన్‌వాడి సెంట ర్‌ను ప్రారంభించారు.
కేసముద్రం మండలం అమీణాపురం గ్రామంలో ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా విద్యార్థులకు క్రీడాపోటీలు ప్రారంభించారు. కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మణ్ గంట సంజీవరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్‌రావు, తహసీల్దార్ ఎర్రయ్య, ఎంపీడీవో క్రాంతి, ఎస్సై మురిళీధర్ తదితరులు పాల్గొన్నారు.




