13 April, 2026 | 3:05 PM

ఇంటింటికీ ఇంటర్నెట్

08-12-2024 02:48 AM
  1. తక్కువ ధరకే నాణ్యమైన హైస్పీడ్ సేవలు
  2. పైలెట్ ప్రాజెక్టుగా మూడు గ్రామాల ఎంపిక 
  3. విజయోత్సవాల సందర్భంగా ఫైబర్‌నెట్ ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాం తి): రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రానున్నది. నగరాలు, పట్టణాలతోపాటు గ్రామా ల్లోనూ హైస్పీడ్ క్వాలిటీ ఇంటర్నెట్ అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలోని 33 జిల్లాలను 10 జోన్లుగా విభజించి టీ|ఫైబర్ గ్రిడ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్రైవేటు సంస్థల ద్వారా ఇంటర్నెట్ అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది.

సం బంధిత అధికారులు ఇప్పటికే ఆయా సంస్థ ల నుంచి టెండర్లు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. తొలుత 3 నెలలపాటు ఇంటర్నెట్, టీవీ ప్రసారాలను ఉచితంగా అందించేలా ఆలోచనలు చేస్తున్నారు. ఆ తర్వాత అతి తక్కువ ధరలకే సేవలను అందించే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. 

మూడు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు 

సంగారెడ్డి జిల్లా ఆంధోల్ మండలం సం గుపేట, నారాయణపేట జిల్లాలోని మద్దూరు, పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్‌ను పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ గ్రామాల్లో పూర్తిస్థాయిలో నెట్‌వర్క్ విస్తరిస్తున్నది. ఈ పైలట్ గ్రామాల్లో ప్రధానంగా కేబుల్ టీవీ సర్వీస్, కేబుల్ వర్చువల్ డెస్క్‌టాప్ కనెక్టివిటీ, 20 ఎంబీ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, టెలిఫోన్ సౌకర్యం కల్పించనుంది.

ఈ గ్రామా ల్లో వచ్చే ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోనుంది. దీంతోపాటు, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ గ్రామాల్లో 360 డిగ్రీస్‌లో ఆర్టిఫిషి యల్ ఇంటలిజెన్స్‌ను ఉపయోగించి సీసీ కెమెరాలు అమర్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. రెండు నెలల్లో పైలెట్ ప్రాజెక్టు పూర్తి చేసి అక్కడి ఫలితాల ఆధారంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది.  

రూ.300లకే  అందుబాటులోకి..

ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ సేవలను రూ.300కే ప్రజల కు అందుబాటులోకి తీసుకురానున్న ట్టు సమాచారం. గతంలో కేంద్ర టెలి కాం శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాతో భేటీ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న టీ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ చేర్చాలని విజ్ఞ ప్తి చేశారు.తెలంగాణలోని ప్రతి గ్రామం, మండలాలకు నెట్‌వర్క్ కల్పించడమే టీ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని కేంద్రమంత్రికి రేవంత్‌రెడ్డి వివరించా రు.

దీంతోపాటు 65 వేల ప్రభుత్వ సం స్థలకు కూడా సేవలందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీ ణ ప్రాంతాల్లో ఉన్న 63 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగం గా ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే టీ ప్రాజెక్టును ఈ నెల 8న సీఎం ప్రారంభించనున్నారు.