17 April, 2026 | 8:26 PM

Breaking News

ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •   ఎర్రకుంట స్మశాన వాటికలో చెట్ల తొలగింపు   •  

చిన్ని తాబేలును నేనే!

18-05-2025 12:00 AM

ప్రపంచంలోనే అతి చిన్న తాబేలు ఇది. దీని పేరు  చెర్సోబియస్ సిగ్నాటస్. దీని స్వస్థలం దక్షిణాఫ్రికా. ఇది ఎడారి తాబేలు రకానికి చెందిన జీవి. అంటే ఈత రాదు. నీటిలో జీవించదు. నేల మీద చిన్న చిన్న రాళ్ల మధ్య బతుకుతుంది. మొక్కలు, గడ్డిని ఆహారంగా తీసుకుంటుంది. ఈ తాబేలులో మగవి ఆరు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. ఆడవేమో పది సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి.

వీటి బరువు సుమారు 95-165 గ్రాముల మధ్య ఉంటుంది. వీటి షెల్ గోధుమ రంగులో ఉంటుంది. ఇవి తడి నేలలో గుడ్లు పెడతాయి. వీటి నుంచి 100-120 రోజుల తర్వాత పిల్లలు బయటకు వస్తాయి. అప్పుడే పుట్టిన పిల్లలు ఏడు గ్రాముల కంటే కూడా తక్కువ బరువు ఉంటాయి. పర్యావరణ మార్పులు, ఇతర జంతువుల వేట, అక్రమ రవాణా చేయడం వల్ల వీటి సంఖ్య రోజు రోజుకూ బాగా తగ్గిపోతున్నది.