calender_icon.png 11 February, 2026 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడే పుర పోరు

11-02-2026 01:27:02 AM

  1. 12 మున్సిపాలిటీల్లో 

260 వార్డులకు ఎన్నికలు

1,072 అభ్యర్థుల పోటీ

3,35,244 ఓటర్లు 

13న ఓట్ల లెక్కింపు

మహబూబాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఉ మ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో 260 వార్డు కౌన్సిలర్ పదవులకు నేడు పోలింగ్ జరగనుంది. వరంగల్ జిల్లాలో న ర్సంపేట, వర్ధన్నపేట, హనుమకొండ జిల్లా లో పరకాల, ములుగు జిల్లాలో ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి, జనగామ జిల్లాలో జనగామ, స్టేషన్ ఘనాపూర్, మహబూబాబాద్ జిల్లాలో మ హబూబాబాద్, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం, తొర్రూరు మున్సిపాలిటీలకు ఎన్ని కలు జరగనున్నాయి.

మొత్తం 12 మున్సిపాలిటీల్లో 260 వార్డు కౌన్సిలర్ పదవులకు 1,072 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నా రు. జిల్లావ్యాప్తంగా 12 మున్సిపాలిటీల్లో 3,35,244 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 1,63,088 కాగా, 1,72,087 మంది మహిళలు ఉండడం విశేషం. ఇతరులు 69 మంది ఉండగా మొ త్తంగా పురుషులతో పోలిస్తే మహిళల సం ఖ్య అధికంగా ఉండడంతో మహిళా ఓట్లు మున్సిపల్ ఎన్నికల్లో కీలక కాలున్నాయి. 260 వార్డుల్లో 50 శాతం వార్డులు మహిళలకు కేటాయించారు. అలాగే కేసముద్రం (ఎస్టీ), మరిపెడ (జనరల్) , నర్సంపేట (బీసీ), ములుగు (బీసీ), మహబూబాబాద్ (ఎస్టీ) చైర్ పర్సన్ పదవులను మహిళలకు కేటాయించారు.

పటిష్టమైన బందోబస్తు

మహబూబాబాద్ జిల్లాలో ఐదు మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికల కోసం 750 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. ఐదుగురు డిఎస్పీలు, 16 మందిర్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 27 మంది ఎస్‌ఐలు, 97 మంది ఏ ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, 543 కానిస్టేబుళ్లు, 63 మంది మహిళ పోలీసులు బందోబస్తు నిర్వహణలో ఉంటారని చెప్పా రు. ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం

మహబూబాబాద్ జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో 98 వార్డులకు జరగనున్న ఎన్ని కలకు 193 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు 234 పోలింగ్ అధికారులు, 234 సహాయ పోలింగ్ అధికారులు, 697 ఇతర పోలింగ్ అధికారులకు తోడుగా అదనంగా 20 శాతం అధికారులను ప్రత్యేకంగా కేటాయించినట్లు చెప్పారు.

281 కెమెరాలను ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పో లింగ్ కేంద్రాల్లో విద్యుత్, తాగునీటి వసతి, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పా రు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.