ఫీజు చెల్లింపునకు నేడే చివరి రోజు
02-05-2024 02:02 AM
ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులకు డీఐఈఓ సూచన
హైదరాబాద్ సిటీ బ్యూరో, మే 1 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు మే 2 (గురువారం) చివరి తేదీ అని హైదరాబాద్ జిల్లా ఎడ్యుకేషనల్ ఆఫీసర్ దాసరి ఒడ్డెన్న బుధవారం విజయక్రాంతితో చెప్పారు. విద్యార్థులు సంబంధిత కళాశాలల్లోనే ఫీజును చెల్లించాలన్నారు. జిల్లాలో మొదటి, రెండో సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు 61,532 మంది ఉన్నారని తెలిపారు. మే 24 నుంచి జూన్ 2 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.




