ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
02-05-2024 02:03 AM
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): తెలంగాణలో ఐసెట్ దరఖాస్తుల గడువును పొడిగించారు. మార్చి 5న విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30వ తేదీతో గడువు ముగియగా.. దాన్ని మే 7 వరకు పొడిగిస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆలస్య రుసుము లేకుండా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఐసెట్ కన్వీనర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.250 ఆలస్య రుసుముతో మే 17 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మే 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. జూన్ 5, 6వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.




