సెమీస్‌లో నిఖత్ జరీన్
ఆసియా చాంపియన్ షిప్‌లో ఖాయమైన పతకం
మంగోలియా: తెలంగాణ బాక్స ర్, మాజీ వరల్డ్ చాంపియన్ నిఖ త్ జరీన్ ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో అదరగొడుతోంది. తన ఫామ్ కొనసాగిస్తూ సెమీఫైనల్ కు దూసుకెళ్లి పతకం ఖాయం చేసుకుంది. 51 కేజీల విభాగం లో బరిలోకి దిగిన నిఖత్ క్వార్టర్ ఫైనల్లో ఫిలిప్పీన్స్‌కు చెందిన జియా న్ బగుహిన్‌పై విజయం సాధించింది.
తొలి రౌండ్‌లో బై పొందిన ఆమె క్వార్టర్స్‌లో పూర్తి ఆధిపత్యం కనబరిచింది. ఎటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. దీంతో రిఫరీ తొలి రౌండ్‌లోనే బౌట్‌ను నిలిపివేసి నిఖత్ గెలిచినట్టు ప్రకటించారు. సెమీ స్‌లో నిఖత్‌కు గట్టి సవాలే ఎదురుకానుంది. పారిస్ ఒలింపిక్స్ గోల్ మెడలిస్ట్, చైనా బాక్స ర్ వు యూతో నిఖత్ తలపడనుంది. సెమీస్‌లో ఓడితే కాంస్యం గెలుస్తుంది.




