41 ఏ నోటీసు ఇచ్చాకే విచారణ చేపట్టండి
సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో హైకోర్టు తీర్పు
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డిని దూ షించిన కేసులో నిందితుడికి సీఆర్‌పీసీ 41ఏ సెక్షన్ అమలు చేయాలని పోలీసులకు హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా ఆకుల శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తి సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైంది. ఆ కేసును శ్రీనివాసరెడ్డి సవాల్ చేయగా, బుధవా రం జస్టిస్ శ్రీనివాసరావు విచారించి పైవిధంగా ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు వ్యతిరేకంగా చేసిన పోస్టులపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ శ్రీనివాసరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. 41ఏ నోటీసులు ఇవ్వాలని ఆదేశించిన జడ్జి పిటిషన్ విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించారు.




