calender_icon.png 11 February, 2026 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడే పుర పోలింగ్

11-02-2026 02:30:50 AM

116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు 

  1. బరిలో 12,930 మంది అభ్యర్థులు 
  2. ఓటర్లు 52 లక్షల మంది 
  3. పకడ్బందీగా ఈసీ ఏర్పాట్లు
  4.   8,203 కేంద్రాలు ఏర్పాటు
  5.   100 శాతం వెబ్ కాస్టింగ్.. 3 వేల మంది అదనపు బలగాలు 
  6. హైదరాబాద్ మినహా అన్నిచోట్లా కోడ్
  7. రాష్ట్రవ్యాప్తంగా రూ. 3.09 కోట్ల సొత్తు స్వాధీనం: డీజీపీ శివధర్‌రెడ్డి 

హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): తెలంగాణ పురపాలికలకు  నేడు బుధవారం పోలింగ్ జరగనుంది. దీని కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది.  రాష్ట్రవ్యాప్తంగా 116 మునిసిపాలిటీలు, 7 నగరపాలక సం స్థలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2,982 వార్డులకు 12,930 మంది అభ్యర్థులు పోటీ- పడుతున్నారు. ఎన్నికల సంఘం  8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో 52.50 లక్షల మంది ఓటర్లు తమ ఓటు- హక్కును వినియోగిం చుకోనున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఈ ఎన్నికల్లో ఎటు-వంటి సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు- చేస్తోంది.  

పట్టిష్ట బందోబస్తు

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ మి నహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంద ని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మంగళవారం హైద రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఎన్నికల ఏర్పాట్లు, సీజ్ చేసిన నగదు, బందోబస్తు వివరాలను వెల్లడించారు.

కోటిన్నర నగదు.. భారీగా మద్యం సీజ్ 

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో రూ. 3.09 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ తెలిపారు. ఇందులో రూ. 1.29 కోట్ల నగదు ఉండగా, రూ. 1.21 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేశామన్నారు. అలాగే రూ. 15.7 లక్షల విలువైన డ్రగ్స్, రూ. 28.69 లక్షల విలువైన బంగారం, ఇతర ఆభరణాలను పట్టుకున్నట్లు వివరించారు.

అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 55 చెక్ పోస్టులు, 4 రాష్ట్రాల సరిహద్దుల్లో 20 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, ఫ్లయింగ్ స్క్వాడ్స్, 167 స్టాటిక్ సర్వేలెన్స్ బందాలు నిరంతరం విధుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. శాంతిభద్రతల దష్ట్యా 1,183 లైసెన్స్ ఆయుధాలను స్వాధీనం చేసుకోగా.. 4,318 మందిని బైండోవర్ చేశామని, 398 మందిపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేశామని డీజీపీ వెల్లడించారు.

సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా 

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. వీటిలో 1,302 కేంద్రాలను హైపర్ సెన్సిటివ్ గా, 1,926 కేంద్రాలను సెన్సిటివ్ గా, 4,975 కేంద్రాలను సాధారణ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీజీఎస్పీ, ఫారెస్ట్, ఎక్సైజ్, సీఐడీ, లీగల్ మెట్రాలజీ తదితర శాఖల నుంచి 3,000 మంది అదనపు బలగాలను మోహరించినట్లు చెప్పారు.

ఎన్నికల పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం కల్పించామన్నారు. ముఖ్యంగా హైపర్ సెన్సిటివ్ కేంద్రాల లోపలే కాకుండా, బయట కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా నిఘా ఉంచామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచే ‘సైలెంట్ పీరియడ్’ అమల్లోకి వచ్చిందని, ఓటర్లు భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీజీపీ శివధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.