4 March, 2026 | 6:07 PM

నేడు సిరిసిల్లకు తీన్మార్ మల్లన్న

04-03-2026 12:00 AM

శ్రీ రామ క్షేత్రం సందర్శన

హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): సిరిసిల్ల జిల్లాకు బుధవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రానున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అయిన శ్రీ రామ క్షేత్రం (రామోజీపేట)ను సందర్శించనున్నారు. మల్లన్న ఉదయం 8 గంటలకు తన కార్యాలయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలలోపు రామోజీపేటకు చేరుకుంటారు. ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రాంత ప్రజలతో మరియు పార్టీ శ్రేణులతో సమావేశమయ్యే అవకా శం ఉంది. పార్టీ నాయ కు లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు.