4 March, 2026 | 5:47 PM

బాలికపై లైంగికదాడి కేసులో నిందితునికి సంవత్సరాల జైలు శిక్ష

04-03-2026 12:00 AM

జగిత్యాల, మార్చి 3 (విజయ క్రాంతి): మల్యాల  పోలీస్ స్టేషన్ పరిదికి చెందిన మైనర్ బాలికను అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడు మహమ్మద్  రజాక్(50) అనే వ్యక్తికి 20 సంవత్సరాల కఠిన కారగార శిక్ష, 15 వేల జరిమాన విధిస్తూ న్యాయమూర్తి  రత్న పద్మావతి తీర్పునిచ్చారు.  బాధిత బాలికకు 3 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు.

నిందితుడిపై  పోక్సో చట్టం కింద, 2022లో మల్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయగా అప్పటి ఇన్స్పెక్టర్  రమణమూర్తి  దర్యాప్తు చేసి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుకు ఆధారాలు సమర్పించగా, పిపి, కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షులను ప్రవేశపెట్టగా సాక్షులను విచారించిన న్యాయమూర్తి నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్బంగా ఎస్పి అశోక్ కుమార్ మాట్లాడుతూ  సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని అన్నారు.

పోలీసులు, ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ, న్యాయ నిరూపణ వేగవంతంగా  జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు. నిందితునికి  శిక్ష పడటం  పడటంలో కృషి చేసిన పీపీ సిహెచ్ రామకృష్ణ రావు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ రమణమూర్తి, సిఎంఎస్  ఎస్‌ఐ శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ కె.వి సాగర్, సిఎంఎస్ కానిస్టేబుల్స్ శ్రీధర్, కిరణ్ కుమార్ లను  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.