1 August, 2026 | 6:58 PM

Breaking News

కేరళ గ్లోబల్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ   •   ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థిని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ పోస్టర్ ఆవిష్కరణ   •   ఊర పండుగ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ   •   చిట్టాపూర్‌లో మహిళా గ్రామసభ   •   నిజాయతీ చాటుకున్న వ్యాపారికి సామాజిక కార్యకర్త ఘన సన్మానం   •   పుట్టిన బిడ్డకు తల్లిపాలే మొట్ట మొదటి టీకా   •   గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే లక్ష్యం   •   ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధనకు నా వంతు కృషి చేస్తా: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య   •   వికలాంగులకు అన్నదానం చేసిన తాటిపల్లి భూపతి   •  

నేడు ఓట్ల లెక్కింపు ఫలితాలు

13-02-2026 12:15 AM

మొత్తం తొమ్మిది టేబుల్స్.. 4రౌండ్లలో 18 వార్డులు ఓట్ల లెక్కింపు

చేవెళ్ళ ఫిబ్రవరి 12(విజయక్రాంతి): కొత్తగా ఏర్పడిన చేవెళ్ల మున్సిపాల్ కు నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిసింది. నేడు ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశం వివరాలు వెల్లడించారు. చేవెళ్లలోని ‘ఎన్ ఎక్స్ టీ డబ్ల్యూఏవీ ఈ ఇన్స్టిట్యూట్ అడ్వానస్డ్ టెక్నాలజీస్ హైదారాబాద్ (ఓల్ ఫరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ చేవెళ్ళ) లో బ్యాలెట్ బాక్సులు భద్రపరిచారు.

ఇక్కడే ఫిబ్రవరి 13 శుక్రవారం బ్యాలెట్ బాక్స్ లోని ఓట్ల లెక్కింపుకు పూర్తయిన అనంతరం ఫలితాలు వెల్లడించనున్నారు. ఓట్ల లెక్కింపునకు 9 టేబుల్స్ ఏర్పాటు చేశామని, 9 వార్డుల ఓట్లను రెండు రౌండ్లలో పూర్తి చేసి మిగతా 9 వార్డుల ఓట్ల లెక్కింపు మరో రెండు రౌండ్లలో లెక్కిస్తామని స్పష్టం చేశారు. మొత్తం నాలుగు రౌండ్లలో 18 వార్డుల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. ఇదివరకే అభ్యర్థుల వారిగా కౌంటింగ్ పాసులు జారీ చేశామని తెలిపారు. వివిధ పార్టీల ఇండిపెండెంట్ అభ్యర్థులు కౌంటింగ్ సమయంలో అధికారులకు సహకరించాలని కోరారు. 

నిర్వహణకు వీల్లు పని చేస్తున్నారు 

అయితే జిల్లా కలెక్టర్ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో మున్సిపల్ కమిషనర్ ఎన్నికల అధికారులు ఏడుగురు రిటర్నింగ్ ఆఫీసర్స్ లు ఏడుగురు అసిస్టెంటెన్ట్ టర్నింగ్ ఆఫీసర్స్, నలుగురు జెడ్‌ఓలు, ఐడుగురు రూట్ ఆఫీసర్లు, రిజర్వ్ పిఓలు, ఏపిఓలు, ఓపిఓలు కలిపి 205 మంది 200మంది పోలీసు అధికారులు, 25 సెన్సిటివ్ &హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లు, ఒక ప్రత్యేక అధికారి 10 మంది మైక్రో అబ్జర్వర్లను పనిచేస్తున్నారు.

మొత్తం ఓటర్లు - 25,371

పోలైన ఓట్లు - 20531

పోల్ కాని ఓట్లు - 4840

పోలింగ్ కేంద్రాలు - 37

ఓటింగ్ శాతం - 80.92 (81%).

మొత్తం వార్డులు-18

లెక్కింపు టేబుల్స్ -09

మొత్తం రౌండ్స్ -04