calender_icon.png 13 February, 2026 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

13-02-2026 12:16:19 AM

సూర్యాపేట, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): నేడు జరగనున్న ఓట్ల లెక్కింపుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపుకు సంభందించి జిల్లా కేంద్రంలో స్థానిక శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ లు ఓట్ల లెక్కింపు గదుల ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్ ల భద్రతను పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించి సిబ్బందికి సూచనలు సలహాలు అందించారు. ఎక్కడ కూడా లోపాలు తలెత్తకుండా, సమస్యలు రాకుండా పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత అధికారుల ద్వారా జారీ చేయబడిన గుర్తింపు కార్డులో ఉన్న అభ్యర్థులను, ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించాలని అధికారులకు సూచించారు.. లెక్కింపు గదులలో అభ్యర్థులు, ఏజెంట్లు క్రమశిక్షణ పాటించేలా చూడాలని సూచనలు చేశారు. సూర్యాపేట, కోదాడ, హుజుర్నగర్, మున్సిపాలిటీ కేంద్రాలకు మూడు చొప్పున లెక్కింపు గదులు, తిరుమలగిరి నేరేడుచర్ల మున్సిపాలిటీలకు రెండు చొప్పున లెక్కింపు గదులు మొత్తం 13 లెక్కింపు గదులను కేటాయించడం జరిగిందన్నారు. ఆయా గదులలో వార్డులు, బ్యాలెట్ల ఆధారంగా లెక్కింపు టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

ఓట్ల లెక్కింపులో సమర్థవంతంగా విధులు నిర్వహించే సిబ్బందిని కేటాయించాం అన్నారు. లెక్కింపు గదులలో పూర్తి భద్రతతో బారికేడింగ్ చేసి సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశాం అన్నారు. లెక్కింపు కేంద్రాలలోకి ఎవరు కూడా సిరా సీసా, వాటర్ బాటిల్స్ మంటను ప్రేమించే వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి లేదు అన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ లెక్కింపు కేంద్రం వద్ద ఐదు అంచెల పోలీసు భద్రతను ఏర్పాటు చేశామని కళాశాల ప్రాంగణమంతా పోలీసు భద్రతలో ఉందని తెలిపారు.

లెక్కింపు విధులు నిర్వర్తించే సిబ్బంది, లెక్కింపుకు వచ్చే అభ్యర్థులు ఏజెంట్లు అధికారులు వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.  ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు బ్యాలెట్ బాక్స్ స్ట్రాంగ్ రూమ్ లో వద్ద భారీగా పోలీసులతో పహారా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వీరి వెంట స్థానిక ఆర్డిఓ వేణుమాధవ్, డి.ఎస్.పి ప్రసన్నకుమార్, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎమ్మార్వో కృష్ణయ్య, ఎన్నికల అధికారులు ఉన్నారు.