1 July, 2026 | 11:37 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

తాగునీటి సమస్య పరిష్కారానికి 1916 టోల్ ఫ్రీ

19-06-2025 12:54 AM

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాం తి): రాష్ట్రంలోని గ్రామీణ తాగునీటి సమస్యలకు సులభంగా పరిష్కారం లభించ నున్నది. తాగునీటి సమస్యలపై ఫిర్యాదుల కోసం నాలుగు అంకెల టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలకు సులువుగా గుర్తుండేలా కొత్త నంబర్‌ను ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క ఆదేశాల మేరకు 11 అంకెల టోల్‌ఫ్రీ స్థానంలో 1916 నంబర్ తీసుకొచ్చింది. టోల్ ఫ్రీ ద్వారా వచ్చే ఫిర్యాదులను మిషన్ భగీరథ సిబ్బంది సత్వరమే పరిష్కరిస్తున్నారు.

మిషన్ భగీరథ శాఖలో గ్రామీణ తాగునీటి సమస్యల ఫిర్యాదులను పరిష్కరించడానికి గతంలో 1800 599 4007 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉండేది. రాష్ట్రవ్యాప్తంగా మిషన్ భగీరథ సేవలు అందుకుంటున్నవారిలో ప్రధానంగా గ్రామీణులు ఈ 11 అంకెల టోల్ ఫ్రీ నంబర్‌కు డయల్ చేయడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు అంకెల నంబర్‌ను వినియోగించుకునేలా మిషన్ భగీరథ విభాగం సౌకర్యం కల్పించింది.