15 April, 2026 | 12:58 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రేపు కామినేని ఈస్ట్ హైదరాబాద్ హాఫ్ మారథాన్

27-12-2025 01:11 AM
  1. రెండు వేల మందితో కార్యక్రమ నిర్వహణ 
  2. ఏర్పాట్లు పూర్తి చేసిన ఈవెంట్ నిర్వాహకులు

హైదరాబాద్, డిసెంబర్ 26: ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యం తో నిర్వహిస్తున్న కామినేని ఈస్ట్ హైదరాబాద్ హాఫ్ మారథాన్ 2025కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ రన్నర్స్ సంస్థలో భాగంగా ఏర్పడిన ఎల్బీనగర్ రన్నర్స్ ఆధ్వర్యంలో ప్రతియేటా నిర్వహించే ఈ ప్రతి ష్టాత్మక వార్షిక రన్నింగ్ ఈవెంట్ ఈ నెల 28 న ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన టీషర్టులు, మెడళ్ల ఆవిష్కరణ శుక్రవారం ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రి ఇందిరా ఆడిటోరియంలో ఘనంగా జరిగింది.

కామినేని ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ డా.గోకుల్ రఘురామ్, మార్కెటింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ ఏఆర్‌ఎస్ సత్యనారాయణలు పాల్గొని అధికారికంగా టీషర్టులు, మెడళ్లను ఆవిష్కరించారు. ఎల్బీనగర్ రన్నర్స్‌కు చెందిన సుమారు 30 మంది రన్నర్లు, కామినేని ఆస్పత్రికి చెంది న సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని ఈవెంట్‌కు తమ మద్దతు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వార్షిక రన్నింగ్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రతీ సంవత్సరం పాల్గొనేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండటం విశేషం. 

హైదరాబాద్ నగరంతో పాటు నగరం వెలుపల ప్రాంతాల నుంచి కూడా ప్రతిరోజూ నడక, పరుగులపై ఆసక్తి ఉన్న అనేక మంది ఈ మారథాన్లో పాల్గొంటున్నారు.ఈ సంవత్సరం నిర్వహించనున్న కామినేని ఈస్ట్ హైద రాబాద్ హాఫ్ మారథాన్ 2025లో మొత్తం నాలుగు విభాగాలు ఉన్నాయి. హాఫ్ మారథాన్ (21.1 కిలోమీటర్లు), 10 మైళ్లు (16.1 కిలోమీటర్లు), 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు.

ఈ నాలుగు విభాగాల్లో కలిపి సుమారు 2,000 మంది రన్నర్లు పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.ఈ నెల 28న ఆదివారం ఉదయం నిర్వహించనున్న ఈ రన్నింగ్ ఈవెంట్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పైఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎల్బీనగర్ రన్నర్స్ నిర్వాహకులు పిలుపు నిచ్చారు.