27-12-2025 01:14:19 AM
న్యాయవాది సంఘం, డేట్స్ రికవరీ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్, డిసెంబర్ 26: న్యాయవాది సంఘం, డేట్స్ రికవరీ ట్రిబ్యునల్, హైదరాబాద్ న్యాయవాదుల సభ్యులతో ప్రెసిడెంట్ కేవీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో డేట్స్ రికవరీ ట్రిబ్యునల్‌కు సంబంధించిన సెక్యూరిటేషన్ చట్టం 2002, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ సంబంధించిన సెమినార్‌ను గురువారం శివం రోడ్‌లోని సత్యసాయి ట్రస్ట్ సమావేశపు హాల్‌లో సీనియర్ అడ్వకేట్ అంబడిపూడి సత్యనారాయణ ఆక్షన్ సేల్ సంబంధించి బ్యాంకులు తీసుకోవలసిన చర్యలు, జాగ్రత్త లు, నేటి హైకోర్టు, సుప్రీంకోర్టులో తీర్పులు వివరించారు.
పేరి రామకృష,్ణ న్యాయవాది ఇన్సాల్వెన్సీ బ్యాంకర్ప్సీ కోడ్ అమలు చేసే విధానాలు, చట్టపరిధి వివరించారు. అనంత రం నూతన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్‌గా కేవీ నాగేశ్వరరా వు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యన్ రామారావు, వైస్‌ప్రెసిడెంట్ యం కనకదుర్గ, ట్రజరర్ టీ విద్యారాణి, సెక్రెటరీ ఆర్ కాశి విశ్వనాథ్, జాయింట్ సెక్రటరీ1 కే దుర్గాప్రసాద్, జాయిం ట్ సెక్రటరీ 2 యం శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా అడపాల శివ కోటేశ్వరరావు ,బి. వీణా మాధురిని ఎన్నుకున్నారు.