calender_icon.png 27 December, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు గాంధీ చిత్రపటాలతో గ్రామాల్లో నిరసనలు

27-12-2025 01:09:50 AM

పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ పిలుపు

హైదరాబాద్, డిసెంబర్  26 (విజయక్రాం తి): కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం రద్దు చేసి.. గాంధీ పేరును తొలిగించినందుకు నిరసనగా.. రాష్ట్రంలోని అన్ని గ్రామా ల్లో ఆదివారం (ఈ నెల 28న)  గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేస్తామని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఏఐసీసీ పిలుపు మేరకు ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టామని, ఇప్పుడు గ్రామాల్లో చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద వర్గాలకు పని కల్పించేందుకు ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మ కంగా తీసుకొచ్చిందన్నారు. పేద ప్రజల వ్యతిరేకంగా ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీన చట్టాన్ని నీరుగార్చే కుట్ర చేస్తోందని విమర్శించారు.