calender_icon.png 26 May, 2025 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందాల పోటీలతో అభాసుపాలు

26-05-2025 12:13:30 AM

-మిస్ ఇంగ్లాండ్ పోటీ నుంచి వెళ్లిపోవడంతో మసకబారిన రాష్ట్ర ప్రతిష్ట

-ఆమెను అవమానించినవారు, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి

-లేకపోతే మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం

-బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత

హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): మిస్ వరల్డ్ ఈవెంట్‌లో పాల్గొన్న మిస్ ఇంగ్లాండ్ అవమానం జరిగిందంటూ అర్థాంతరం గా తన దేశం వెళ్లిపోవడంతో అం దాల పోటీలు అభాసుపాలయ్యాయని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత విమర్శించారు. మిస్ ఇంగ్లాండ్‌ను అవమానపరిచిన వారిపై, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశా రు.

లేకపోతే తాము మానవ హ క్కుల కమిషన్‌కు ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ తెలంగాణభవ న్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సునీత మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి పుణ్యమా అని భారత్ పరువు, తెలంగాణ పరువు అంతర్జాతీయంగా మసకబారిందన్నారు.

మహిళలను గౌరవించే తెలంగాణ గడ్డ మీద విదేశీ మహిళకు అవమానం జరిగిందన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని, అందాల పోటీల చుట్టూ సీఎం, మంత్రులు తిరిగారన్నారు. సీఎం ఆరు సార్లు అందాల పోటీలకు వెళ్లారన్నారు. పోటీల నుంచి వైదొలిగిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను వ్యభిచారి లా చూశారని వాపోయారని, ఇదేనా అతిథులకు ఇచ్చే గౌరవమని గొంగిడి సునీత మండిపడ్డారు.

ప్రపంచ దేశాల్లో మన పరు వు పోయిందని, మన మహిళలకు అగౌరవం జరిగితే చూస్తూ ఊరుకుంటామా అన్నారు. ఆమెకు జరిగి న అవమానానికి ఎవరు సమాధా నం ఇస్తారని ప్రశ్నించారు. అందాల పోటీలతో పెట్టుబడులు వస్తాయా అని సునీత మండిపడ్డారు. సమావేశంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ రజనీ సాయిచంద్ పాల్గొన్నారు.