15 May, 2026 | 3:46 PM

ఐదురోజుల్లో సీఎంఆర్ అప్పగించాలి

21-06-2024 12:15 AM

రైస్‌మిల్లర్లకు కలెక్టర్ హెచ్చరిక

నాగర్‌కర్నూల్, జూన్ 20 (విజయక్రాంతి): జిల్లాలోని రైస్ మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని ఐదు రోజుల్లోగా ఆడించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ప్రభుత్వానికి అందించాలని రైస్‌మిల్లుల యజమానులకు కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. గురువారం రైస్ మిల్లర్లతో కస్టమ్ మిల్లింగ్ రైస్ బకాయిలపై ఏర్పాటు చేసిన మీటింగ్‌లో మిల్లర్ల తీరుపై కలెక్టర్ అసహనం వ్యక్తంచేశారు. 2022 వానకాలం సీజన్‌లో 93,268 మెట్రిక్ టన్నులకు 75,853 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సీఎంఆర్ చెల్లించారని ఇంకా 17,415 మెట్రిక్ టన్నులు బకాయి ఉందన్నారు. 2023 సంబంధించి 49,048 మెట్రిక్ టన్నులకు కేవలం 7,192 మెట్రిక్ టన్నులు మాత్రమే అందించారని.. ఇంకా 41,856 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వలేదని మండిపడ్డారు. నిర్దేశించిన గడువులోగా బియ్యం అందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.