15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ముత్తారంలో ఘనంగా దుద్దిళ్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకలు

24-02-2026 04:21 PM

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కాసర్ల గడ్డ చౌరస్తాలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా శ్రీనుబాబు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  జెడ్పిటిసి నాగినేని జగన్మోహనరావు, ఏఎంసి వైస్ చైర్మన్ రాజయ్య,  కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గోవిందుల పద్మ ఆనంద్, యూత్ అధ్యక్షుడు బక్కతట్ల వినీత్ యాదవ్, మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు జావిద్ పాషా,  కాంగ్రెస్ నాయకులు బుచ్చంరావు,  నూనెటి కృష్ణ యాదవ్, కోల విజయ్ గౌడ్, డా.చారి,  రాపల్లి రామన్న, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.