calender_icon.png 25 May, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు

24-05-2025 11:22:56 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(TPCC President Bomma Mahesh Kumar Goud) జన్మదిన వేడుకలను కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని కొత్తపల్లిలోని స్పందన అనాధాశ్రమంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనాధ పిల్లలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంబాలరాజు మాట్లాడుతూ.. కార్యకర్త నుండి మొదలైన తన రాజకీయ ప్రస్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ యు ఐ అధ్యక్షునిగా, యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు.

నికార్సైన  కాంగ్రెస్ కార్యకర్తకు ఏదో ఒక రోజు పదవులు వస్తాయని చెప్పడానికి నిదర్శనం పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఉదాహరణ అని తెలిపారు. రాబోయే మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎగటి సదానందం, ఉప్పుల సాంబశివరెడ్డి, సిలువేరి రాజమౌళి, లాదల వెంకటేష్, మహమ్మద్ సందాని,తూర్పాటి రాజు,అభిలాష్, జష్వంత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.