calender_icon.png 25 May, 2025 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైకుల దొంగ అరెస్టు

25-05-2025 12:00:00 AM

- ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం 

- కేసు వివరాలు వెల్లడించిన డీసీపీ చంద్రమోహన్

 కార్వాన్, మే 24: రద్దీ ప్రాంతాలను ఎంచుకొని బైకులు అపహరిస్తున్న ఓ వ్యక్తిని లంగర్ హౌస్ పోలీసులు అరెస్టు చేసి ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

కేసు వివరాలను శనివారం సౌత్ వెస్ట్ జోన్ డిసిపి చంద్రమోహన్ టోలిచౌకి పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన సమావేశం లో మీడియాకు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతనపల్లి గ్రామానికి వర్తీయ గోపాల్ అలియాస్ తవారియ శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో లంగర్ హౌస్ లోని రామాలయం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నా డు.

ఎస్‌ఐ రాఘవేంద్ర ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయే యత్నం చేశాడు. కొద్ది దూరంలోనే అతడిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి తమదైన శైలిలో విచారించగా బైకుల చోరీ విషయం తెలిపాడు. అతడు వేర్వేరు పోలీస్ స్టేషన్లో పరిధిలో బైకులు చోరీ చేసినట్లు గుర్తించారు.

ప్రధానంగా లంగర్హౌస్ పిఎస్ పరిధిలో ఐదు ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈదీ బజార్ ఫాతే షా నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ కాజా డెకరేషన్ పనిచేసేందుకు మే 5 న మొయినాబాద్ లో డెకరేషన్ చేసేందుకు వెళ్లాడు. లంగర్ హౌస్ లోని రామాలయం వద్ద అతడి బైక్ను పార్కు చేసి బస్సు పై వెళ్ళాడు.

అతడు మరుసటి రోజు తిరిగి వచ్చి చూడగా బైకు కనిపించలేదు చోరీ జరిగిందని గుర్తించి లంగర్ హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు గుడిమల్కాపూర్ లోని పూల మార్కెట్లో పనిచేస్తూ చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని డూప్లికేటు తాళపుచెవిళ్లతో బైకులను అపహరించడం అలవా టు చేసుకున్నట్లు డీసీపీ చంద్రమోహన్ వెల్లడించారు.

కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్‌ఐ రాఘవేంద్ర తో పాటు సిబ్బందిని డిసిపి ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో గోల్కొండ ఏసీపీ సయ్యద్ ఫయా జ్, లంగర్ హౌస్ ఇన్స్పెక్టర్ వెంకట రాము లు, ఎస్‌ఐ రాఘవేంద్ర తదితరులు ఉన్నారు.