25-05-2025 12:00:00 AM
- ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఈటల రాజేందర్
మేడ్చల్, మే 24(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మీర్పేట్ హౌసింగ్ బోర్డు కాలనీలో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహాల్గంలో అమాయకులను కాల్చి చంపిన పాకిస్తాన్ ఉగ్రవాదులకు భారత సైని కులు వీర నారీమణుల ఆధ్వర్యంలో ఆపరేషన్ సిందూర్ పేరిట తగిన బుద్ధి చెప్పారన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందున ప్రధాని నరేంద్ర మోడీకి, భారత సైని కులకు సంఘీభావంగా తిరంగా యాత్ర చేపట్టామన్నారు.
భవిష్యత్తులో ప్రధాని మోడీకి అండగా ఉండాలని, భారతమాతను రక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, సుభా ష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కాటిపల్లి జనార్దన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి, కార్పొరేటర్లు శివాని, చేతన పాల్గొన్నారు.