2 April, 2026 | 6:51 PM

హనుమంతుడి గుణాలు అందరికీ ఆదర్శనీయం

02-04-2026 04:55 PM
  1. చిక్కడపల్లిలో హనుమంతుడిని దర్శించిన కాంగ్రెస్ చీఫ్ 
  2. హాజరైన ఏఐసీసీ కోఆర్డినేటర్ బిజ్జి శత్రు
  3. ఆలయ కమిటీ ఛైర్మన్ జానకి సుధీర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాకార్యక్రమాలు

చిక్కడపల్లి,(విజయక్రాంతి): చిక్కడపల్లిలోని ఆంజనేయ స్వామిని తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(TPCC president Mahesh Kumar ) దర్శించుకున్నారు. గురువారం హనుమాన్ జయంతి(Hanuman Jayanti) సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన తన కుటుంబ సభ్యులతో ఆంజనేయుడి గుడిలో మొక్కులు చెల్లించుకున్నారు.

హనుమంతుడు అంటే ధైర్యానికి, స్థైర్యానికి మారుపేరు అని, త్యాగానికి, సాహసానికి, ఎన్నికష్టలున్నా నమ్మిన వారి వెంట నడిచే ధీరుడని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. క్రమశిక్షణతో కూడిన జీవితం కోసం అందరికీ ఆంజనేయ స్వామి ఆదర్శనీయమని కీర్తించారు.  ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కోఆర్డినేటర్ బిజ్జి శత్రు రావు , యూత్ కాంగ్రెస్ నాయకుడు టిల్లు, టెంపుల్ కమిటీ చైర్మన్ జానకి సుధీర్ , మాజీ కార్పొరేటర్ జయేంద్ర బాబు సహా పార్టీ నాయకులు గుర్రం శంకర్ , అభిషేక్  బబ్లూ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.