ట్రాక్టర్ బోల్తా
స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా బుధవారం సిమెంటు ఇటుకలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఆ ప్రాంతంలో (స్పీడ్ బ్రేకర్లు/సైన్‌బోర్డులు) లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.ఇటీవల రోడ్డు మరమ్మత్తురులో భాగంగా నూతనంగా తారు రోడ్డు వేయడంతో వాహనాలు అధిక వేగంతో వెళ్తుండటంతో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. పాత అటవీశాఖ చెక్పోస్ట్ నుండి జనకాపూర్ వరకు పలు ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన హెచ్చరిక బోర్డులు పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.




