గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ అందజేత
సెరెనా రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ సంస్థ ప్రతినిధుల వితరణ
శంషాబాద్, మార్చి2 (విజయక్రాంతి): శంషాబాద్ మండలం, పెద్ద షాపూర్ గ్రామపంచాయతీకీ క్లీన్ అండ్ గ్రీన్ అభివృద్ధి కార్యక్ర మానికి సెరెనా రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ సంస్థ ప్రతినిధులు కులకర్ణి, శ్రీనివాస్ ఇంజమూరి, సుబ్బారావు, రానా, మాధవ శర్మలు కలిసి రూ.10లక్షలు విలువ చేసే ట్రాక్టర్‌ని గ్రామ సర్పంచి దేవుళ్లపల్లి సునీత సత్యనారాయణ గౌడ్‌కి అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సునీత మాట్లాడుతూ పెద్ద షాపూర్ గ్రామాభివృద్ధికి సహకరించిన సంస్థ ప్రతినిధులకు మా కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. కార్యక్రమంలో శంషాబాద్ మాజీ ఏఎంసీ చైర్మన్ కొలను మహేందర్ రెడ్డి,పెద్ద షాపూర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, గ్రామపంచా యతీ కారోబర్ చక్రధర్, సెక్రటరీ జితేందర్ రెడ్డి , గ్రామపంచాయతీ పెద్దలు పాల్గొన్నారు.




