16 April, 2026 | 2:31 AM

ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత: ఆరుగురు వ్యక్తుల బైండోవర్

16-04-2026 01:07 AM

కరీంనగర్ క్రైం, ఏప్రిల్15(విజయక్రాంతి): పోలీసులు గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మొగ్దూంపూర్ గ్రామానికి చెందిన మీసాల రాజు అనునతడు తన యజమాని అయినా వడ్లూరి సంపత్ యొక్క ఆదేశాల మేరకు మానేరు వాగు నుండి తీసుకొని దొంగలించి అక్రమంగా రవాణా చేస్తుండగా మొగ్దూంపూర్ గ్రామంలో కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు అట్టి ట్రాక్టర్లు సీజ్ చేసి నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి చర్య నిమిత్తం కోర్టుకు పంపించడం జరిగినది..

ఇటీవల అక్రమ ఇసుక రవాణా చేస్తూ పట్టుబడిన మానకొండూరు మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ముత్యం అజయ్, వెల్ది గ్రామానికి చెందిన నగునూరి అనిల్, సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కొత్తూరి కుమార్ , కొత్తూరు వెంకటేష్ మొగ్దుంపురు గ్రామానికి చెందిన మీసాల రాజు వడ్లూరి సంపత్లను మరొకసారి ఎటువంటి చట్టవ్యతిరేకమైన పనులు చేయకుండా కరీంనగర్ రూరల్ తాసిల్దార్ ముందు హాజరు పరిచి లక్ష రూపాయల పూచికత్తుపై బైండోవర్ చేసినట్టు ఏ నిరంజన్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ రూరల్ తెలిపారు.