20 June, 2026 | 8:42 PM

Breaking News

బాధిత కుటుంబాలకు ‘పీఎస్ఆర్’ భరోసా   •   మా అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఎస్పీ   •   సింగరేణి ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం: జి ఎం షాలెం రాజు..   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదు   •   మత్తు రహిత పటిష్ట సమాజ నిర్మాణానికి యోగ ఒక్కటే మార్గం   •   గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమిష్టి కృషి   •   ఉద్యాన పంటల సాగును 5 లక్షల ఎకరాలకు విస్తరించాలి   •   అధిక సాంద్రత పత్తి సాగులో న్యూమాటిక్ ప్లాంటర్‌తో విత్తనాల విత్తకం ప్రదర్శన   •   డిజిటల్ లిటరసీ, ఏఐ నైపుణ్యంతో ఉజ్వల భవిష్యత్తు   •   రాజీ మార్గమే రాజమార్గం: సీనియర్ సివిల్ జడ్జి కే.సురేష్   •  

అక్రమంగా గ్రావెల్ మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

25-11-2025 12:00 AM

- అక్రమంగా గ్రావెల్, ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు

- తహాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు 

భద్రాచలం, నవంబర్ 24, (విజయక్రాంతి) అక్రమంగా గ్రావెల్ మట్టి, ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవని భద్రాచలం తహసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం పట్టణంలో అనుమతులు లే కుండా గ్రావెల్ మట్టిని తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.

ఈ మేరకు భారీగా పెనాల్టీ విధించారు. ఈ సందర్భంగా ధనియాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... భద్రాచలం పట్టణ శివారులో అక్ర మంగా గోదావరి గర్భం నుంచి ఇసుకను తోడుతున్నారనే సమాచారంతో ఇటీవల ట్రెంచ్ కొట్టడం జరిగిందని, అదేవిధంగా అనుమతులు లేకుండా గ్రావెల్ మట్టిని రవాణా చేస్తున్నారని సమాచారం అందడంతో ట్రాక్టర్లను అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. కావున అక్రమంగా మట్టిని, ఇసుకను రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.