calender_icon.png 25 November, 2025 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యాహ్న భోజన కార్మికులను ఆదుకోండి

25-11-2025 12:00:00 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి) : రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. మధ్యా హ్న భోజన కార్మికులు మాట్లాడిన వీడియో పోస్టు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తమనే డబ్బా ప్రచారం ఇకనైనా ఆపి.. అప్పుల పాలయ్యాం మొర్రో అని మొత్తుకుంటున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులను ఆదుకోవాలని సూచించారు. 13 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వారి జీతాలు, బిల్లు లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.