05-07-2025 12:00:00 AM
గడువు ముగిసినా అమ్మకాలు
నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న ఖమ్మం ఫుడ్ సేఫ్టీ అధికారులు
రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడుల్లో బట్టబయలు
ఖమ్మం, జూలై -04 (విజయ క్రాంతి): జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం జిల్లాలో కొందరు వ్యాపారస్తులకు వరం అయింది. వారు మామూలు అందుకొని ప్రజల ప్రా ణాలను పణంగా పెడుతున్నారు. ఎక్స్పైరీ డే ట్ స్టిక్కర్లను మార్చి మళ్లీ విక్రయించటం. ఎక్కువ రోజులు నిలువచేసిన ఫుడ్ ను సప్లై చేయటం, కావాల్సిన ప్రమాణాలు పాటించకుండా తయారుచేయడం ఖమ్మం జిల్లాలో పరిపాటయింది.
జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారి ఉన్నారు. కొత్తగా సిబ్బంది రిక్రూట్ అయి వచ్చిన తనిఖీ చేసిన సందర్భాలు తక్కువే. నామమాత్ర తనిఖీలు తప్పించి ఎక్కడ సీజ్ చేసింది లేదు, కేసులు బుక్ చేసింది లేదు. అధికారులకు నెలనెలా ముడుపులు అందడంతో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నా రని జిల్లా ప్రజలు బార్ఘట్టంగా చెప్పుకుంటున్నా రు. ఈ విషయం శుక్రవారం రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ బృందం ఆకస్మిక దాడుల్లో బహిర్గతమైంది.
తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ వి భాగం ఉన్నతాధికారులు, ఐపిఎం డైరెక్టర్ డాక్టర్ సి. శివలీల ల ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పె క్టర్స్ రోహిత్ రెడ్డి, పి. స్వాతి, శ్రీషిక, సిహెచ్. లోకేష్, శరత్ లతో కూడిన బృందం ఖమ్మం పట్టణంలోని పలు వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా వారికి అత్యంత నాసిరకం, నాణ్యత ప్రమాణాలు లే కుండా తయారు చేసే విధానం, ఎక్స్పైరీ అ యిన ఫుడ్ లభ్యమయ్యాయి. దీంతో వారు పలువురికి నోటీసులు అందజేసి, వేలది రూ పాయలు విలువ చేసే వస్తువులను వారు ముందే ధ్వంసం చేశారు. వీరు పాటిస్తున్న ప్రమాణాలకు నిర్గాంత పోయిన జ్యోతిర్మయి, వారి బృందం పలు యజమాను లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైరా రోడ్ లో గల పి ఎస్ కే ఫుడ్స్, ఎన్టీఆర్ సర్కిల్ లో గల జీ.పి. రెడ్డి స్వీట్ షాప్, ఐస్ క్రీమ్ యూ నిట్, పాలమూరు గ్రిల్స్ రెస్టారెంట్ లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.పాలమూ రు గ్రిల్స్ రెస్టారెంట్ నందు వంట గది అపరిశుభ్రంగా ఉండడం, రిఫ్రిజిరేటర్, కోల్ ఛాంబర్ లలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకా రం సరైన ఉష్ణోగ్రతను మెయిన్ టైన్ చేయకపోవడం, సుమారు 2 వేల రూపాయల విలువ కలిగిన 8 లీటర్ల కాలం చెల్లిన ఫ్రూట్ క్రషెస్, సుమారు 19 వేల రూపాయల విలు వ గల 40 కిలోల కాజు, షాజీరా, నూడిల్స్, ఇతర ముడి సరుకులపై లేబుల్ డిఫెకట్స్ కలిగి ఉండడం, అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచిన కూరగాయలను గుర్తించి, హో టల్ యాజమాన్యం పై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్ వి. జ్యోతిర్మయి తీవ్ర ఆగ్ర హం వ్యక్తంచేస్తూ, అప్పటికప్పుడేధ్వంసం చేసి ఎఫ్.ఎస్.ఎస్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేయడం జరిగింది. వైరా రోడ్ లో గల పిఎస్కే ఫుడ్స్ అండ్ స్పు సెస్ లో విస్తృత తనిఖీలు చేయగా, ఫుడ్ హ్యాండ్లర్స్ ఎటువంటి పరిశుభ్రత ప్రమాణాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవ డం, తయారీ కేంద్రంలో తగిన లైటింగ్, వెం టిలేషన్ లేకపోవడం, ప్లాస్టిక్ డ్రమ్ములలో పచ్చళ్లను నిల్వ ఉంచడం, ముడి సరుకులు నిల్వ ఉంచడానికి సరైన స్టోరేజ్ సదుపాయా లు లేకపోవడం, ఆహార పదార్థాలు, ముడి సరుకులపై ఈగలు ఉండడం గుర్తించిలేబు ల్ డిఫెకట్స్ కలిగిన రెడీ టు ఈట్ సేవరిస్, మినప్పప్పు, రాక్ సాల్ట్ , బెల్లం, నూనె, నె య్యి, మొదలగు పదార్థాలను గుర్తించి యా జమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేసిన టాస్క్ ఫోర్స్ హెడ్ వీ జ్యోతిర్మయి బృందం వాటిని సీజ్ చేశారు, అనుమానిత శాంపిళ్లను పరీక్ష నిమిత్తం హైదరాబాదులో గల ల్యాబ్ కు పంపించడం జరుగుతుందని టాస్క్ ఫోర్స్ హెడ్ తెలిపారు.
ఎఫ్.ఎస్.ఎస్. చట్టం 2006 ఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేశారు.వైరా రోడ్ లో గల ఐబాకో ఐస్ క్రీమ్ యూనిట్లో సరైన పేరుతో లైసెన్స్ లేకపోవ డం, అపరిశుభ్ర వాతావరణంలో ఐస్ క్రీము లు, చాక్లెట్లు నిల్వ ఉంచడం, తయారీ, ఎక్స్పై రీ డేట్ లను వినియోగదారులకు సరైన విధములో డిస్ ప్లే చేయకపోవడం, అపరిశుభ్ర వాతావరణంలో రిఫ్రిజిరేటర్లలో చాక్లెట్లు ఇతర పదార్థాలను నిల్వ ఉంచడం, సరైన పె స్ట్ కంట్రోల్ పద్ధతులను పాటించకపోవడంతో యాజమాన్యానికి నోటీసులు అం దించడం జరిగింది.
ఎన్టీఆర్ సర్కిల్ లో గల జిపి రెడ్డి ఘీ స్వీట్స్ లో పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో కేక్స్ తయారు చేయడం, కేక్స్, ఇతర స్వీట్స్ తయారీలో హానికర రసాయనాలు కలిగినటువంటి రంగులు కలప డం, ప్లాస్టిక్ బకెట్లలో క్రీమును నిల్వ ఉంచ డం, ఈగలతో కూడినటువంటి కేకు ను ని ల్వ ఉంచడం, 20 వేల రూపాయల విలువగల ఐదు కిలోల కాలం చెల్లిన చెర్రీస్, ఫ్రూట్ క్రషెస్, గుర్తించి వాటిని ప్రజారోగ్యం నిమి త్తం అక్కడికక్కడే ధ్వంసం చేయడం జరిగిం ది.
లేబుల్ డిఫెకట్స్ కలిగిన సుమారు 30 వేల రూపాయల విలువ గల 15 కిలోల క న్ఫెక్షనరీ పదార్థాలు, డ్రై ఫ్రూట్స్, మిస్సలేనియస్ పదార్థాలను సీజ్ చేయడం జరిగింది. ప్రజారోగ్యంతో చెలగాటమాడే ఆహార త యారీదారులు, ఆహారం అమ్మేవారు ఆహార పరిరక్షణ ప్రమాణాలను పాటించి, ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా ఆహారాన్ని ప్ర జలకు విక్రయించాలని హెచ్చరిస్తూ లేనియెడల చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమో దు చేస్తూ, అవసరమైతే సంబంధిత శాఖ సహాయంతో సీజ్ కూడా చేస్తామని జ్యోతిర్మయి హెచ్చరించారు.
ఇప్పటికైనా జిల్లా ఫు డ్ సేఫ్టీ అధికారులు ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు కృషి చేస్తారో లేదో చూడాలి.