27 March, 2026 | 10:50 PM

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో స్తంభించిన ట్రాఫిక్

27-03-2026 08:55 PM

గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకున్న భక్తులు

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలో శుక్రవారం జరిగిన సీతారామ కళ్యాణం తిలకించేందుకు భక్తులు వివిధ వాహనాల ద్వారా భద్రాచలం చేరుకొని కళ్యాణ వీక్షించారు. కల్యాణం అనంతరం తిరిగి వారి గమ్యస్థానాలకు వెళ్లడానికి బయలుదేరిన యాత్రికులు ట్రాఫిక్ ఇబ్బందులతో నరకయాతన అనుభవించారు. భద్రాచలంలోని ప్రధాన రహదారి ఆయన బ్రిడ్జి వద్దనుండి అంబేద్కర్ సెంటర్ వరకు వందలాది వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. కళ్యాణం పూర్తి అవ్వడంతో ఒకసారిగా భద్రాద్రి వచ్చిన వాహనాలన్నీ తిరిగి వారి వారి కమ్మే స్థానాలకు వెళ్ళటానికి బయలుదేరటం దీనికి తోడు వందలాదివి ఆర్టీసీ బస్సులు సైతం రోడ్డు ఎక్కటంతో ఈ పరిస్థితి దాపురించింది.

అయితే ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ముందుగా అనేక సమావేశాలు పెట్టుకుని నిర్దిష్ట ప్రణాళికలు తయారు చేసుకున్న అవి ఏవి సత్ఫలితాలు ఇవ్వలేదు. కేవలం ఒకరోజు ట్రాఫిక్ నే క్రమబద్ధీకరించలేని పోలీస్ అధికారులు రాబోయే గోదావరి పుష్కరాలలో 10 రోజులు పాటు ఏ విధంగా క్రమబద్ధీకరిస్తారనేది ప్రజలలో సందేహంగా మారింది. ట్రాఫిక్ సిబ్బంది పూర్తి నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి నెలకొన్నది. దాంతో బ్రిడ్జి దాటడానికి రెండు మూడు గంటలు పైగా సమయం పట్టింది.

ముఖ్యమంత్రి భద్రాద్రిని వదిలి వెళ్ళే దాకా ట్రాఫిక్ మంచిగా ఉన్నప్పటికీ ఆయన వెళ్లిపోగానే ట్రాఫిక్ అధికారులు వదిలివేయడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రాబోయే పండుగలను పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఉన్నత అధికారులు సమీక్షలతో పాటు ట్రాఫిక్ కరం బద్దీకరణలో ఎదురయ్యే వాస్తవ పరిస్థితులు కూడా తెలుసుకొని సిబ్బందిని అప్రమత్తంగా ఉంచి శాశ్వత ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు