2 April, 2026 | 3:18 AM

హనుమాన్ జయంతి సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్స్

02-04-2026 12:00 AM
  1. హనుమాన్ జయంతి శోభాయాత్ర నేపథ్యంలో ట్రాఫిక్ మల్లింపు
  2. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం  సాయంత్రం 5 గంటల నుండి కామారెడ్డి పట్టణంలో శోభాయాత్ర నిర్వహించ పడుతుందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ప్రజల సౌకర్యార్థం , ట్రాఫిక్ రద్దీ నివారణ కోసం క్రింది విధంగా ట్రాఫిక్ మార్పులు (డైవర్షన్స్) అమలు చేయబడుతున్నా యని  అన్నారు

కోడూరు హనుమాన్ టెంపుల్ నుంచి ర్యాలీ ప్రారంభం

కోడూరు హనుమాన్ టెంపుల్ నుండి ర్యాలీ ప్రారంభం కానున్నందున, నిజాంసాగర్ చౌరస్తా నుండి జీవధాన్ వైపు వెళ్లే వాహనదారులు మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్రత్యామ్నాయ రోడ్డును వినియోగిం చుకోవాలన్నారు. కామారెడ్డి పట్టణంలోకి ప్రవేశించవలసిన భారీ వాహనాలు, బస్సులు, ఫోర్ వీలర్స్ టేక్రియాల్ బైపాస్ చౌరస్తా మార్గం ద్వారా పట్టణంలోకి ప్రవేశించాలన్నారు.

కామారెడ్డి నుండి హైదరాబాద్ వైపు వెళ్లే బస్సులు , ఫోర్ వీలర్స్ నిజాంసాగర్ చౌరస్తా మార్గాన్ని ఉపయోగించకుండా, కామారెడ్డి బస్టాండ్ టేక్రియాల్ బైపాస్ మార్గం ద్వారా హైదరాబాద్ వైపు ప్రయాణించాలన్నారు. పై ట్రాఫిక్  మార్పులను గమనించి, హనుమాన్ జయంతి శోభాయాత్ర విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని కామారెడ్డి పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తున్నదన్నారు.

మీ సహకారం  సురక్షిత ప్రయాణం కావాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రజలు ఇతర గ్రామాల నుంచి వచ్చే ప్రజలు హనుమాన్ శోభయాత్ర ప్రశాంతంగా జరిగేలా సహకరించాలన్నారు.