5 August, 2026 | 1:52 AM

అగధ నాలో మార్పు తెచ్చింది!

05-08-2026 12:00 AM

కామాక్షి భాస్కర్ల, శ్రవణ్‌రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భానుచందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయారాణిరెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ ముఖ్యపాత్రలను పోషించిన చిత్రం ‘అగధ’. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎంఎస్ రాజు తెరకెక్కించారు. ఈ సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేబోతోన్నారు. ఈ క్రమంలో మేకర్స్ హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. కేవీఎల్‌ఎన్ రాజు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమం కథానాయిక కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ.. “డిఫరెంట్ కారెక్టర్స్‌ను పోషించాలని ప్రతీ నటికి ఉంటుంది. ‘పొలిమేర’ తర్వాత మళ్లీ ఆ స్థాయి పాత్ర నాకు లభించలేదు.

కానీ రాజు ఈ ‘అగధ’ కథ, అందులో నా పాత్రను చెప్పిన తర్వాత ఆశ్చర్యపోయా. నటిగా మళ్లీ నన్ను నేను నిరూపించుకోవడానికి చక్కటి అవకాశం లభించింది. నేను చేసే ప్రతీ సినిమాకు, అందులోని పాత్రకు వ్యత్యాసం ఉండేలా చూసుకుంటా. నటిగా నాకు విభిన్నమైన పాత్రలు వస్తుండటం నా అదృష్టం. ‘అగధ’ వల్ల నాలో ఎంతో మార్పు వచ్చింది. ఇంతకు ముందు కంటే కామ్ అయ్యాను. స్పిరిట్యువల్‌గా మారిపోయా. ఆగస్ట్ 14న ‘అగధ’ అంటే ఏంటో అందరికీ తెలుస్తుంది” అని తెలిపింది. ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. “అగధ’లో అద్భుతమైన కథతోపాటు స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత కాశీ విశాలాక్షి, నటీనటులు శ్రవణ్‌రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్ తదితర చిత్రబృందం కూడా మాట్లాడారు.