6 June, 2026 | 2:07 PM

జంతర్ మంతర్ వ‌ద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' ధర్నా

06-06-2026 12:48 PM

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party)  ఆన్‌లైన్ ఉద్యమ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే(CJP founder Abhijit Deepke), జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన నిరసన(Cockroach Janta Party Protest) కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన మద్దతుదారులను క్రమశిక్షణ పాటించాలని , నిరసన శాంతియుతంగా సాగేలా చూసుకోవాలని కోరారు. ఈ నిరసనకు మద్దతు ప్రకటించిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, ఒకవేళ దిప్కేను అరెస్టు చేస్తే తాను ఆరు వారాల పాటు నిరాహార దీక్ష చేస్తానని పేర్కొన్నారు.

'X' వేదికగా చేసిన ఒక పోస్ట్‌లో జంతర్ మంతర్ వద్ద మద్దతుదారులను కలవబోతున్నందుకు డిప్కే ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. అలాగే, వారితో పాటు ఒక పుస్తకాన్ని, జాతీయ జెండాను తీసుకురావాలని కోరారు. ఈ ఉద్యమాన్ని ప్రేమ,శాంతితో నడిపించాలని నొక్కిచెప్పిన ఆయన, పోలీసు సిబ్బందికి కరుణ, కృతజ్ఞతా భావంతో పూలను సమర్పించాలని పాల్గొనేవారికి పిలుపునిచ్చారు.

అటు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు చేపట్టింది. జంతర్ మంతర్ వద్ద భారీగా యువత తరలివస్తున్నారు. నీట్ పేపర్ లీక్, CBSC ఓఎస్ఎం వివాదంపై సీజేపీ నిరసనకు పిలుపునిచ్చింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కాగా, CJP ధర్నాకు పోలీసుల అనుమతిచ్చారు. సాయంత్రం ఐదు గంటల వరకు శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని సీజేపీ ప్రకటించింది. కాక్రోచ్ మాస్కులతో యూత్ నిరసనకు తరలివచ్చారు.  భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య 'కాక్రోచ్ జనతా పార్టీ' నిరసన కోసం జంతర్ మంతర్ వద్ద జనం గుమిగూడారు.