calender_icon.png 12 November, 2025 | 10:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాడ్రిడ్‌లో కీలక ఘట్టం

12-10-2024 01:16:29 AM

కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో అజిత్‌కుమార్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెలుగు -తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని-, వై రవిశంకర్ నిర్మాతలు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ అజిత్‌కుమార్‌ను మూడు డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌లో ప్రజెంట్ చేసి, సినీప్రియుల్లో అంచనాలు పెంచేసింది.

తాజాగా మేకర్స్ విడుదల చేసిన అజిత్‌కుమార్ స్టన్నింగ్ లుక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మాడ్రిడ్‌లో జరుగుతోంది. సినిమాకు ఎంతో కీలకమైన షెడ్యూల్ ఇదేనని చిత్రబృందం పేర్కొంటోంది. అజిత్‌కుమార్, ఇతర నటీనటులపై క్రూషియల్ సీన్స్ షూట్ చేస్తున్నారు.

దర్శకుడు అధిక్ రవిచంద్రన్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా తీసుకువస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. డీవోపీ: అభినందన్ రామానుజం; సంగీతం: దేవి శ్రీప్రసాద్; ఎడిటర్: విజయ్ వేలుకుట్టి; స్టంట్స్: సుప్రీం సుందర్, కలోయన్ వోడెనిచరోవ్.