18 June, 2026 | 2:53 AM

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో బీఎల్‌ఏలకు శిక్షణ శిబిరం

18-06-2026 12:51 AM

మధిర, జూన్17 (విజయక్రాంతి): టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టి బిఎల్‌ఏలకు శిక్షణ శిబిరం. బుధవారం మధిర పట్టణంలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా దుద్దిళ్ల శ్రీను బాబు మాట్లాడుతూ... ఎన్నికల ప్రక్రియలో బిఎల్‌ఏల పాత్ర అత్యంత కీలకమని, ఓటరు జాబితాల పరిశీలన, సవరణలు, అభ్యంతరాల నమోదు, అర్హులైన ప్రతి ఓటరిని జాబితాలో చేర్చే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పని చేస్తూ, పార్టీ బలోపేతానికి ప్రతి బిఎల్‌ఏ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడాలని తెలిపారు. మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తలుపుల వెంకటేశ్వర్లు, మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పారుపల్లి విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కర్నాటి రామారావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ చిట్టిబాబు  కాంగ్రెస్ పార్టీ, బిఎల్‌ఏలు పాల్గొన్నారు.