calender_icon.png 28 October, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటరు జాబితా సరిపోలికపై బీఎల్ఓలకు, సూపర్వైజర్లకు శిక్షణ

27-10-2025 10:24:59 PM

నూతనకల్ (విజయక్రాంతి): ​జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి, అడిషనల్ కలెక్టర్ ఆదేశముల మేరకు స్థానిక తహసీల్దారు కార్యాలయంలో సోమవారం ఓటరు జాబితా సరిపోలిక, నమోదుపై బీఎల్ఓ(బూత్ లెవల్ ఆఫీసర్లు), సూపర్వైజర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ​తహసీల్దారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణలో ​2002 ఓటరు జాబితాను ప్రస్తుతము ఓటర్లుగా నమోదవుతున్న వారి పేర్లతో సరిపోల్చడం ​బిఎల్ఓ యాప్(BLO App) ద్వారా ఈ పేర్లను మ్యాపింగ్ చేసి, వివరాలను కచ్చితంగా నమోదు చేయడం వంటి అంశాలపై వారికి అవగాహన కల్పించారు.

ఈ సందర్బంగా తహసీల్దార్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ​ఓటరు జాబితాలో ఎటువంటి తప్పులు లేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదయ్యేలా చూడాల్సిన బాధ్యత బీఎల్ఓలు, సూపర్వైజర్లపై ఉందని  స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించడం ద్వారా ఓటరు జాబితా ప్రక్షాళన జరుగుతుందని, ఎన్నికల ప్రక్రియ మరింత సమర్థవంతంగా మారుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల బిఎల్ఓ లు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.