27-10-2025 10:26:49 PM
అశ్వాపురం (విజయక్రాంతి): అశ్వాపురం మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుదోవ పట్టించే ప్రచారాలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. వారు మాట్లాడుతూ గంటకొక్క అర్థం పర్థం లేని పోస్టులు పెడుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు మీ డ్రామాలు గమనిస్తున్నారు. మీరు పెట్టే పోస్టులు చూసి నవ్వుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు. మీరు దిగిపోయే నాడు రోడ్ల పరిస్థితి ప్రజలకు మరిచిపోయిందనుకోవడం అవివేకం. ఇప్పుడు చేస్తున్న సెల్ఫీ సెట్టింగులు చివరికి మీకే సెల్ఫ్ గోల్ అవుతాయి.
మాజీ ప్రభుత్వంలో ఇసుక, మట్టి, గ్రావెల్ దందాలతో రోడ్లు నాశనం చేసి, ఇప్పుడు అదే రోడ్లలో గుంతలు ఉన్నాయని నటించడం విడ్డూరం అన్నారు. మీ గవర్నమెంట్‌లో వేసిన సిమెంట్ రోడ్ల దగ్గర సెల్ఫీలు పెట్టే ధైర్యం ఉందా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 24 నెలల్లో అశ్వాపురం మండలంలో ₹4 కోట్ల విలువైన 90 పైగా రోడ్లకు నాణ్యతా పరీక్షలకు మేము సిద్ధం ,మీరు సిద్ధమా? అని ప్రశ్నించారు.ప్రతి పథకానికి రేటు ఫిక్స్ చేసి పాలించిన ఘనత మీదే. దళిత బంధు, బీసీ బంధు, పట్టా పంపిణీ, కేసులు, సాయం అన్నింటినీ వాణిజ్యంగా మార్చారు. ఇప్పుడు నీతులు మాట్లాడటం హాస్యాస్పదం.
గుంతలు పడిన రోడ్ల రిపేర్ పనుల కోసం ఇప్పటికే టెండర్లు పిలిచామని, కొన్ని రోడ్లకు కాంట్రాక్ట్ అగ్రిమెంట్లు పూర్తయ్యాయని, వరుస వర్షాలు, తుఫానుల కారణంగా పనులు ఆలస్యమయ్యాయని పేర్కొన్నారు. త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని రోడ్లు పూర్తి అవుతాయని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య, సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్ బాబు, తూము వీరరాఘవులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆవుల రవి, కొండబత్తుల ఉపేందర్, ఉస అనిల్ కుమార్, లంకమల్ల కొండలరావు, బచ్చు వెంకటరమణ, పగడాల రామిరెడ్డి, చెంచల రాము, గొల్లపల్లి నరేష్ కుమార్, వేముల విజయ్, సంజీవరెడ్డి, శ్రీనివాస రెడ్డి, దారావత్ హర్ష, షారుక్ పాషా, కోలా శశికాంత్, బొజ్జ కృష్ణ, కుంజ జాను తదితరులు పాల్గొన్నారు.