27 July, 2026 | 2:49 AM

కాంగ్రెస్ నేత భాస్కర్ రెడ్డిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

27-07-2026 02:16 AM

తూప్రాన్, జూలై 26: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గుండ్రెడ్డిపల్లి భాస్కర్ రెడ్డి కి మాతృవియోగం. ఇందులో భాగంగా వాళ్ల అమ్మ ఉమ్మన్నగారి రాజమణి గత రెండు రోజుల క్రితం చనిపోయిన విషయాన్ని నాయకుల ద్వారా, కార్యకర్తల ద్వారా తెలుసుకొని అదివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇందులో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నాయకులు చిటుకుల మహిపాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సన్నిహితులు, తదితరులు ఉన్నారు.