16 April, 2026 | 2:28 AM

ఉద్యమ్ రిజిస్ట్రేషన్‌పై శిక్షణ

16-04-2026 12:44 AM

సదాశివనగర్, ఏప్రిల్ 15(విజయక్రాంతి): మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో బుధవారం మండల సమాఖ్య ఆధ్వర్యంలో సీసీలకు మరియు వివోఏలకు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పైన ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అడిషనల్ డిఆర్డిఓ విజయలక్ష్మి  హాజరై ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల గ్రామాల్లోని చిరు వ్యాపారులకు ఎం ఎస్ ఎం ఈ లో భాగంగా రుణాలు తీసుకోవడానికి అవకాశం కలుగుతుందని తెలిపారు. సదాశినగర్ మండలంలోని అన్ని గ్రామాలలో ఇట్టి పని ఏప్రిల్ 17 నుంచి మే 16 లోపల పూర్తి చేయాలని సూచించడం జరిగింది. కార్యక్రమంలో ఏపిఎం ప్రసాద్, ఎమ్మెస్,ఓబి,, సీసీ లు, ఎంఎస్ స్టాఫ్,వివో ఏలు పాల్గొన్నారు.