నిబంధనల ప్రకారం డిగ్రీ అడ్మిషన్లు కోర్సుల నిర్వహణ జరగాలి
ఎం జి యూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్
నల్లగొండ టౌన్, ఏప్రిల్ 15: నిబంధన ప్రకారం డిగ్రీ అడ్మిషన్లు కోర్సుల నిర్వహణ జరగాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ కాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు బుధవారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్ లు,ఆడిట్ సెల్ ఆధ్వర్యంలో డిగ్రీ అడ్మిషన్లు, కోర్సుల నిర్వహణ వీధి విధానాలపై ఎం జి యూ లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ దోస్త్ నియమాకల ప్రకారం 25% కన్నా కోర్సుల్లో విద్యార్థులు తక్కువ ఉంటే కోర్సు రద్దు పరచి వారిని వేరే గ్రూప్లో కానీ వేరే కళాశాలకు కానీ పంపించాలని సూచించారు కోర్సుల నిర్వహణకు నాణ్యమైన విద్యను అందించి మెరుగైన మానవ వనరులను అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ వై ప్రశాంతి, డా జయంతి, సమరీన్ కాజ్మీ, మరియు వివిధ కళాశాలల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.






