calender_icon.png 6 December, 2024 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల బదిలీ నా చేతుల్లో లేదు

08-11-2024 12:21:50 AM

  1. కుటుంబ సర్వే సమాజ రుగ్మతలను తెలిపే ఎక్స్‌రే వంటిది : మంత్రి పొన్నం 
  2. హుస్నాబాద్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

హుస్నాబాద్, నవంబర్ 7: ఆర్టీసీ ఉద్యోగుల బదిలీ తన చేతుల్లో లేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 3,4,5,18 వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి, అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

ఆర్టీసీ ఉద్యోగులు బదిలీల కోసం తన వద్దకు వస్తున్నారని, ఆ విషయంలో తానేమీ చేయలేనని అన్నారు. గురుకులాలు, ఇతర స్కూళ్లల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీల్లో జోక్యం చేసుకోలేనని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న కుటుంబ సర్వే సమాజ రుగ్మతలను తెలిపే ఎక్స్‌రే వంటిదని అన్నా రు.

అన్ని వర్గాలకు సమన్యాయం చేసేందుకే సర్వే చేస్తున్న ట్లు తెలిపారు. మున్సిపాలిటీల్లో కూడా ఉపాధి హామీ పథ కం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపుతానని మంత్రి పేర్కొన్నారు.

కార్యక్రమంలో కలెక్టర్ మనుచౌదరి, గ్రంథాలయ చైర్మన్ లింగామూర్తి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్‌పర్సన్ అనిత, కమిషనర్ మల్లికార్జున్ పాల్గొన్నారు. 

ఇండస్ట్రియల్ కారిడార్‌కు స్థల పరిశీలన

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని చౌటపల్లిలో ఇండస్ట్రియల్ కారిడార్ పార్కు ఏర్పాటు కోసం టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, కలెక్టర్ మనుచౌదరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ స్థలాన్ని పరిశీలించారు. హుస్నాబాద్ ప్రాంతంలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.

అనంతరం హుస్నాబాద్ మండలం బల్‌నాయక్ తండాకు చెందిన లావుడ్య దేవి అనే మెడికల్ విద్యార్థినికి హాస్టల్ ఫీజు నిమిత్తం రూ.1.50 లక్షల ఆర్థిక సాయం అందించారు.