మమ్మల్ని మరో పాఠశాలకు బదిలీ చేయండి
28-07-2026 12:32 AM
వశిష్ట పాఠశాలలో విద్యా బోధన సరిగా లేదు.. ‘బెస్ట్ అవైలబుల్’ విద్యార్థులు
నిర్మల్, జులై 27(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద చదువుతున్న విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి సోమవారం ఆందోళన చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని వశిష్ట పాఠశాలలో బెస్ట్ అవైలబుల్ స్కీం కింద 80 మంది చదువుతున్నారని, విద్యాబోధన సంతృప్తికరంగా లేదన్నారు. విద్యార్థులను మరో పాఠశాలకు బదిలీ చేయాలని కలెక్టర్‌ను కోరారు.






