11 May, 2026 | 1:12 AM

అదుపు తప్పితే అంతే..

11-05-2026 12:08 AM
  1. రోడ్డు పక్కనే చేతికి అందేలా ట్రాన్స్ఫార్మర్లు 
  2. ప్రమాదం అని తెలిసిన పట్టించుకోరు ఎందుకు?
  3. చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ 
  4. అన్ని తెలిసిన విద్యుత్ శాఖ మౌనం 

గండీడ్, మే 10: విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు మండల పరిధిలోని ఆయా గ్రామాలలో ప్రమాద భరితంగా మారాయి. సంబంధిత లైన్మెన్ లతో పాటు విద్యుత్ శాఖ చేరవేసినప్పటికీ ఆ పరది మాది కాదనట్టు విహరించ డం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ప్రధాన రోడ్డు మార్గాల పక్కనే ఇలాంటి కం చ లేకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉండడంతో ఈ ప్రాంతాలు ప్రమాదాల నిలయంగా మారుతున్నాయి. స్పందించాల్సిన అధికార యంత్రం అసలు పట్టించుకోకపోవడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే ఆలోచనలో రోడ్డు పక్కనే ఎలాంటి కంచె లేకుండా ఉన్న ట్రాన్స్ఫార్మర్లు జనానికి తలనొప్పిలను తీసుకువస్తున్నాయి. కంచెలు ఏర్పాటు చే యండి మహాప్రభు అని వేడుకుంటున్న ప ట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో జనం ఎవరికి చెప్పుకోవాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండల పరిధిలోని వెన్నచేడు గ్రామంలో  రహదారి పక్కనే  25 కేవి ట్రాన్స్ఫార్మర్.  63 కె.వి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లతోపాటు  బీసీ హాస్టల్, దేవాలయాల దగ్గ ర, చెరువు కట్ట నుంచి జక్కలపల్లికి వెళ్లే రహదారిలో ఈ ట్రాన్స్ఫారాలు ఎలాంటి. కంచి లేకుండా. రోడ్డుకు సమీపాన ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు. అలాగే కప్లాపూర్  గేటుకు ఎదురుగా 167 హైవే రహదారి పక్కన ఒక బుడ్డి. మూడు ట్రాన్స్ఫారాలు. ఎలాంటి కంచె లేకుండా దర్శనమిస్తున్నాయి. గ్రామాలే కాకుండా ఇతర గ్రామాలలో కూడా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చుట్టూ కంచెలు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 

ప్రమాదం జరిగినప్పుడే హడావుడి..

ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే విద్యుత్ శాఖ హడావిడి సృష్టించి కేసులు నమోదు చేసి పరిహారం వస్తుంది అంటూ కాలయాపన చేస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏండ్ల తరబడి కంచెలు ఏర్పాటు చేయాలని చెబుతున్నప్పటికీ అది మా పని కాదన్నట్టు వివరించడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తుండ్రు.

రోడ్ల పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్లతో విద్యార్థులతో పాటు ఇతర వాహనదారులు కూడా ట్రాన్స్ఫర్లను చూసి భయభ్రాంతులకు గురి అయ్యే  సం ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాలి నడక వెళ్లే పాదచారులకు చేతులకు అంతే పరిస్థితుల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్లు ఉన్నప్పటికీ సంబంధిత అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉం దా ఒక్కసారిగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేసి కంచెలు ఏర్పాటు చేయాలని జనం చెబుతున్న మాట.

చెప్పిన పట్టించుకోవట్లేదు..

లైన్మెన్ లతో పాటు ఏళ్లకు సమాచారం ఇచ్చినప్పటికీ కంచ ఏర్పాటు చేయడంలో ఎలాంటి చర్య లు తీసుకోవడం లేదు. గ్రామ సభలు ఏర్పాటు చేసినప్పుడన్న దాతల సహకారం కావాలన్నా ఎవరైనా సహాయం చేసేందుకు అవకాశం ఉంటుంది. సంబంధిత అధికారులు అటువైపే ఆలోచన చేయడం లేదు. ఎప్పుడు ఏ చెడు వార్త వినవలసి వస్తుందని భయం భయంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కంచెలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. 

దోమ పులిందర్ రెడ్డి, గండేడ్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా