24 April, 2026 | 2:14 AM

పారదర్శకంగా సీఐడీ విచారణ

29-11-2024 02:12 AM
  1. కోర్టులో నిజాలు బయట పడతున్నాయి
  2. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు

హైదరాబాద్, నవంబర్ ౨౮ (విజయక్రాంతి): తనపై దాడి కేసు లో సీఐడీ విచార ణ పారదర్శకంగా జరుగుతున్నదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. కస్టడీలో తనపై దాడి చేసిన అధికారు లు అరెస్టయ్యారని..

త్వరలో మరికొందరు అరెస్ట్ అవుతారని ఆయన తెలిపారు. తనను కస్టడీలో హింసించిన కేసులో సుప్రీంకోర్టు విచారణ పై రఘురామ సంతృప్తి వ్యక్తం చేశా రు. విజయ్‌పాల్ తనను అక్రమంగా అరెస్ట్ చేసి దురుసుగా ప్రవర్తించాడని, కోర్టులో నిజాలు బయటపడుతున్నాయని చెప్పారు.

అప్పటి సీఐ డీ మాజీ చీఫ్ సునీల్‌కుమార్ తన ప్రైవేట్ సిబ్బందితో దాడి చేయించాడని.. త్వరలో ఆ వివరాలు కూడా బయటికి వస్తాయన్నారు. సునీల్‌కుమార్ రాష్ట్రం, దేశం విడిచిపోకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.