24 April, 2026 | 12:44 AM

వాల్యూ జోన్.. ఇప్పుడు నాచారంలో

29-11-2024 02:13 AM

ముఖ్య అతిథిగా పాల్గొన్న నందమూరి బాలకృష్ణ

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 28 (విజయక్రాంతి): పటాన్‌చెరులో విశేష ప్రజాదరణ పొందుతున్న హైపర్‌మార్ట్ వాల్యూ జోన్ ఇప్పుడు నాచారంలో తమ నూతన స్టోర్‌ను ప్రారంభించింది. గురువారం సినీ నటుడు, హైపర్‌మార్ట్ అంబాసిడర్ నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి స్టోర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియా తో మాట్లాడుతూ.. వాల్యూజోన్ ఖచ్చితంగా గొప్ప రిటైల్ ఫార్మాట్. దాని ఉత్పత్తుల శ్రేణి, షాపింగ్ అనుభవం హైదరాబాద్‌కు గర్వకారణంగా మారుతోంది.

వాల్యూజోన్‌లోని కలెక్షన్లు, బ్రాండ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం వినియోగదారులకు సంతృప్తిని అంది స్తాయ న్నారు. మారుతున్న రిటైల్ ఫార్మాట్‌కు అనుగుణంగా పి.వెంకటేశ్వర్లు, ఎస్.రాజమౌళి, టి.ప్రసాదరావు, దివంగత పి.సత్య నారాయణ వాల్యూజోన్ హైపర్‌మార్ట్‌ను ప్రారంభించారని గుర్తుచేశారు. వాల్యూజోన్.. ఫ్యాషన్, కిరాణా సరుకులు, ఫుట్ వేర్, లగేజ్, ఫర్నీషింగ్, స్టేషనరీ, సాధారణ సరుకులతో పాటు భారతీ య, ప్రఖ్యా తి గాంచిన ప్రపంచ బ్రాండ్‌లను వినియోగదారులకు ఒకేచోట సరసమైన ధరలకు అంది స్తుందన్నారు. వాల్యూజోన్ ప్రతి కుటుంబానికి ఆదర్శవంతమైన షాపింగ్ గమ్యస్థా నంగా మారుతుందనే ధీమా వ్యక్తం చేశారు.